అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
వరంగల్: మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ముందుగా పట్టపగలు రెక్కీ నిర్వహించేవాడు. అనంతరం రాత్రి వేళల్లో ఆయా ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడేవాడు. మిల్స్ కాలనీ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నిందితుడు ఆశిష్ గతంలో మహారాష్ట్రలోనూ పలు నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించిన...