విద్యార్థులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్యే BLR
తుంగపాడు తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ తుంగపాడు తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. హాస్టల్‌తో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. విద్యార్థుల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా హాస్టల్ యాజమాన్యాన్ని విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వారి రోజువారీ నిర్వహణ తదితర అంశాలపై ఎమ్మెల్యే వివరాలు అడిగారు. విద్యార్థులతో వ్యక్తిగత లేదా ఇతర పనులు చేయించడం ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.విద్యార్థులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే...