వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎంపీడీఓ, సర్పంచ్

పర్వతగిరి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రిజర్వాయర్ దగ్గర పోచమ్మ గుడి నుండి మత్తడి వరకు వెళ్లే రోడ్డుకు మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీ M శంకర్ గారు, గ్రామ సర్పంచ్ చీదురు శంకర్ గారు, ఉప సర్పంచ్ చింతకుంట్ల అనిత గారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ...