మహిళా సంఘాల వీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
గోరుకొత్తపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన వీవో (VO) భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. వీవో భవనం నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ,...