నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న నిందితుడి అరెస్ట్

*రూ.36.99 లక్షల మోసాలు వెలుగులోకి – 23 కేసులు, 6 సైబర్ ఫిర్యాదుల్లో నిందితుడి ప్రమేయం గుర్తింపు –* రూ.13.09 లక్షలు హోల్డ్ వరంగల్, ఆగస్టు 25, 2026: నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఆహార సరఫరా అవకాశాల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న అంతర్‌జిల్లా సైబర్ మోసగాడిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.461/2025, U/s 318(4) BNS, Sec.66-D IT Act కేసు దర్యాప్తులో...