ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

*జన చరిత్ర,రాయపర్తి ఆగస్టు 26 :* రాయపర్తి మండలం లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పల్లె దవాఖానా లో వ్యాధి నిరోధక టీకా లు చిన్నారులకు వేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలను తనిఖీ చేసి, గడువు తీరిన మందుకు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మందులను సురక్షితంగా భద్రపరిచే తీరును పరిశీలించారు. ల్యాబొరేటరీ లో మందుల నిలువ, ఇతర వైద్య సామగ్రి గురించి ల్యాబ్ ఇన్‌చార్జిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబొరేటరీని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ల్యాబ్...