మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తవకుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ లంగర్-ఎ-ముహమ్మద్
*తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఆధ్వర్యంలో* వరంగల్,ఆగస్టు 26* మిలాద్-ఉన్-నబీ(సల్లల్లాహు అలైహి వసల్లం)పర్వదినాన్ని పురస్కరించుకుని తవకుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ లంగర్-ఎ-ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాది మంది పేదలు,నిరుపేదలు,సామాన్య ప్రజలకు అన్నదానం చేశారు.ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా తవకుల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ముహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన లంగర్‌కు ప్రవక్త భక్తులు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు భక్తులకు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి సేవలందించారు.మత సామరస్యం,సేవాభావం,పేదలకు అండగా నిలవడం లక్ష్యంగా...