విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలి-బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు

తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగుళ్ల భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన “ఫీజు బకాయిలు–బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను...