ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాలను, ప్రత్యేక గ్రామ సభను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు

హనుమకొండ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాలను, ప్రత్యేక గ్రామ సభను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 49వ డివిజన్‌లో రామాలయం, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్డు సభలు, ఓటరు నమోదు, సవరణ కేంద్రాలను ఆయన సందర్శించారు. బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన ప్రక్రియను పరిశీలించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. తప్పులు లేని పారదర్శకమైన...