బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ‘తీజ్’ ఉత్సవం

హనుమకొండ: బంజార జాతి గర్వించే ఘనమైన పండుగ తీజ్ ఉత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని గిరిజన భవన్‌లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు బంజారా సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తీజ్ ఉత్సవాలు బంజారా సమాజంలో ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో...