జీఓ నెంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం — విద్యార్థుల ఆవేదనకు BRS నాయకుల మద్దతు

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీఓ నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు BRS నాయకులు మద్దతు తెలిపారు. తన్నీరు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమయంలో, వారి ఆందోళనకు మద్దతుగా నిలిచిన BRS నాయకులను మట్టేవాడ CI అరెస్టు చేయడం ఆవేదన కలిగించే విషయం. విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అరెస్టులు మరియు నిర్బంధ చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వుకు సంబంధించిన...