వరంగల్‌లో ఘనంగా జంధ్యా ధారణ కార్యక్రమం

వరంగల్: పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు డి.ఎస్. మూర్తి ఆధ్వర్యంలో వరంగల్ సాయిబాబా ఆలయ ఆవరణలో జంధ్యా ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులబంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని జంధ్యా ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ.. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవడంతో పాటు, భవిష్యత్ తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజ ఐక్యత కోసం ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీందర్, వడ్నాల నరేందర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్ బాబు, గోరంటల రాజు, మాజీ కార్పొరేటర్ గుండేటి...