రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ

రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు ఈరోజు ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ గారు మాట్లాడుతూ.."అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ, మహిళలకు రక్షణ, గౌరవం కల్పించే గొప్ప సంప్రదాయం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, అమ్మ ఆరోగ్యం ద్వారా ప్రతి మహిళకు ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటి...