బైక్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్ – చోరీకి గురైన స్ప్లెండర్ ప్లస్ బైక్ స్వాధీనం
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి చోరీకి గురైన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడి వివరాలు మహమ్మద్ సిద్దికి @ అబూ బక్కర్, తండ్రి పేరు పాషా మియా , వయస్సు 27 సంవత్సరాలు, వృత్తి పండ్ల వ్యాపారి, నివాసం వరంగల్. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు హనుమకొండలో పండ్ల వ్యాపారం చేస్తూ రోజుకు సుమారు రూ.500/- సంపాదిస్తున్నాడు. నిందితుడు మద్యానికి బానిసా అయ్యాడు తను సంపాదించే డబ్బులు తన కుటుంబ అవసరాలు మరియు జల్సాలకు సరిపోవడం లేదని భావించి గతంలో ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో...