ఏనుగల్లు లో మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందచేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి,ఆగస్టు29 : పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శనివారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మాసాని మరియా , ధమిషెట్టి రాజు, రౌతు వీరస్వామిలు మరణించగా వారి నివాసాలకు వెళ్లి మృతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందచేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్ , మాజీ ఏఎంసి డైరెక్టర్ బోయినపల్లి యుగంధర్ రావు , మాజీ చౌటపల్లి చైర్మన్ గంధం బాలరాజు , డాక్టర్.మాజీ ఎంపీటీసీ సాంబానీ లింగమూర్తి...