ఆర్డి ఎఫ్ కళ్లెడ హైస్కూల్‌లో మోడల్ ఎలక్షన్స్ – హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక
*జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, ఆగష్టు 29 :* పర్వతగిరి మండలం ఆర్డి ఎఫ్ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆర్ డి ఎఫ్ కళ్లెడ హైస్కూల్‌లో మోడల్ ఎలక్షన్స్‌ను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల ద్వారా హెడ్ బాయ్, హెడ్ గర్ల్‌ను విద్యార్థులు ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించి, తమ ఆలోచనలు మరియు ప్రణాళికలను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి, ఓట్లను లెక్కించి అత్యధిక ఓట్లు సాధించిన విద్యార్థులను హెడ్ బాయ్ గా బి. సుమన్, హెడ్...