క్రైమ్ పారామీటర్ల అమలులో నల్లగొండ జిల్లా పోలీస్ ఉత్తమ ప్రతిభ* ll *8 అంశాల్లో సమగ్ర పనితీరుతో క్లస్టర్-3లో నల్లగొండకు అగ్రస్థానం

రాష్ట్రస్థాయిలో క్రైమ్ పారామీటర్ల అమలు, పోలీస్ శాఖ పనితీరుకు సంబంధించి నిర్వహించిన సమీక్షలో నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్ల పనితీరును సమీక్షించిన అధికారులు, 8 కీలక అంశాల్లో సమగ్ర పనితీరు ఆధారంగా నల్లగొండ జిల్లాను క్లస్టర్-3లో అగ్రస్థానంలో నిలిపారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారికి డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ గారు ఈరోజు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, అంకితభావంతో ఉత్తమ ఫలితాలు సాధించడంపై డీజీపీ గారు ప్రశంసలు తెలిపారు.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, అన్ని...