ఆటోనగర్, వరంగల్‌లోని బాలుర పరిశీలన గృహాన్ని సందర్శించిన వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ
పరిశీలన గృహంలోని బాలల సంక్షేమం, వసతులు మరియు వారికి అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలన గృహంలోని వసతి గదులు, భోజన సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, విద్యా మరియు వృత్తి శిక్షణ, కౌన్సెలింగ్ సేవలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాలలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు మరియు వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి భవిష్యత్తుపై సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయంపై వారికి అవగాహన కల్పించాలని సూపరింటెండెంట్ శ్రీదేవి కి సూచనలు చేశారు. బాలలకు అవసరమైన విద్య, ఆరోగ్యం,...