జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో సూపర్‌వైజర్ల పాత్ర కీలకం: డీఎంహెచ్ఓ డా. బి. రాజా రెడ్డి
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs), యూఎఫ్‌డబ్ల్యూసీలలో పనిచేస్తున్న పర్యవేక్షకులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, క్షేత్రస్థాయి పనితీరు, లక్ష్యాల సాధనపై సంబంధిత ప్రోగ్రాం అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డా. బి. రాజా రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా చూడడంలో సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలి అని అన్నారు. సూపర్‌వైజర్లు నిరంతరం క్షేత్రస్థాయి...