వరంగల్, ముస్లిం యువతీ యువకులకు వధూవర ముఖ ముఖీ పరిచయ వేదిక
వరంగల్‌లో ఘనంగా ‘ముఖాముఖి–దూబదు’ వధూవర పరిచయ వేదిక ముస్లిం యువతీ యువకులకు అనువైన వివాహ సంబంధాలను కల్పించేందుకు వరంగల్‌లో ‘ముఖాముఖి–దూబదు’ వధూవర పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఎల్బీనగర్‌లోని అబ్నుస్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం 11వ విడతగా ఈ కార్యక్రమం జరిగింది. మైనారిటీ ఇంటెలెక్చువల్ ఫోరం, సియాసత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మైనారిటీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా డీపీఆర్‌ఓ, జీడబ్ల్యూఎంసీ పీఆర్వో అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, మసూద్ మిర్జా మహ్షర్ మాట్లాడుతూ.. ముస్లిం యువతీ యువకులకు వారి అభిరుచులు,...