స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం

ప్రపంచానికి దిశానిర్దేశం చేసేలా భారత్‌ను విశ్వగురువుగా మలిచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రతిపాదించిన పంచపరివర్తన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉత్తమ భారతీయ సమాజాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉందని సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ పేర్కొన్నారు. భాగ్యనగర్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో "సమాచార భారతి" సంస్థ ఆధ్వర్యంలో ''స్థానిక పత్రికలు - సమాజ నిర్మాణం'' అంశంపై ఆదివారం జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఆయన ప్రధానవక్తగా పాల్గొన్నారు. సంఘ్ క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 30కి పైగా వివిధ స్థానిక పత్రికల సంపాదకులు, పాత్రికేయులు పాల్గొని విశేష స్పందన కనబరిచారు. సంఘం...