ఇంధన స్వాతంత్రత వైపు భారత్ పయనం.. E20 దాని చోదక శక్తి

భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి దాదాపు 88 శాతం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా, అది భారత ఆర్థిక వ్యవస్థపై, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై మరియు సామాన్య పౌరుడి జేబుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో, 20 శాతం ఇథనాల్‌తో లభించే E20 పెట్రోల్, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా సాగే సుదీర్ఘ ప్రయాణంలో తొలి దశ ఇది. రాబోయే సంవత్సరాల్లో దేశ ఆర్థిక, వ్యూహాత్మక స్థితిగతులను మార్చివేసే సామర్థ్యాన్ని కలిగిన ప్రయాణమిదీ. అయితే, విచారకరమైన నిజమేమిటంటే విశాల జాతీయ ప్రయోజనాల దృష్టితో అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన...