NCERT మార్పులు – దేశ ప్రయోజనాలు
జాతీయ విద్యా విధానం (NEP), ఎన్సీఈఆర్‌టీ పుస్తకాల నూతన మార్పులు భారత విద్యావ్యవస్థ చరిత్రలో అత్యంత విప్లవాత్మకమైనవి. కేవలం మార్కులు, ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతూ, వలస కాలపు మెకాలే విద్యా విధానానికి ఇది చరమగీతం పాడుతోంది. నూతన సంస్కరణలు సిలబస్ క్రమబద్ధీకరణ ద్వారా ఒత్తిడి లేని అభ్యాసానికి తెరలేపాయి. సంకుచిత రాజకీయ స్వార్థంతో, పాత ఆలోచనలతో ఈ మార్పులపై నెగటివ్ ప్రచారం చేసే వారికి.. ఈ విద్యా విధానం సాధించబోయే అద్భుతమైన దేశ ప్రయోజనాలే చెంపపెట్టులాంటి సమాధానం. ఈ నూతన విద్యా విధానంలో మాతృభాషకు, మన నిజమైన దేశ చరిత్రకు అగ్రతాంబూలం ఇచ్చారు. “ఇంగ్లీష్ మీడియం చదవకపోతే పిల్లలు వెనుకబడిపోతారు” అనే నెగటివ్...