పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే లక్ష్యం: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇసుక అడ్డ పోర్ట్ రోడ్ ప్రాంతంలోని రాజశ్రీ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన మహా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 1,500 మంది పేద, మధ్యతరగతి ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు...