సంచార జాతులకు సానుభూతి కాదు.. సమాన గౌరవం, అవకాశాలు కావాలి

విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలి వృత్తిదారుల కోసం ‘వర్క్ షెడ్ కమ్ హౌస్’ పథకం ప్రవేశపెట్టాలి ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలి: చిప్ప వెంకటేశ్వర్లు నేత వరంగల్, ఆగస్టు 31: సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల పట్ల కేవలం సానుభూతి చూపించడం కాకుండా, వారికి సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని శ్రమశక్తి అవార్డు గ్రహీత, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత అన్నారు. ఆగస్టు 31న పురస్కరించుకుని వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి ఆధ్వర్యంలో సంచార, అర్ధ సంచార, విముక్త...