మిత్రత్వానికి ప్రతిరూపం.. ఆపదలో అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు
వరంగల్ జిల్లా, ధర్మారం: చదువుకున్న రోజుల్లో ఏర్పడిన స్నేహబంధం.. కాలం గడిచినా చెదరలేదు. ఒకే పాఠశాలలో చదువుకున్న మిత్రులు.. సంవత్సరాలు గడిచినా తమ స్నేహాన్ని కొనసాగిస్తూ, ఆపదలో ఉన్న తోటి మిత్రులకు అండగా నిలుస్తున్నారు. వరంగల్ జిల్లా ధర్మారం జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1993–94 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు మిత్రత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. తమ బ్యాచ్‌కు చెందిన మిత్రులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న “పరపతి సంఘం” మరియు మిత్రుల కలయికతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తమ తోటి మిత్రుడు గాదే సుగుణాకర్ మరణించడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు.....