దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి గారు దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య సేవలు, రికార్డులు, రిజిస్టర్లు మరియు సంబంధిత ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సమయానికి అందించాలని, అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని డా. రాజా రెడ్డి సూచించారు. అదేవిధంగా సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరై, పని వేళలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. రికార్డులు,...