వైద్య ఆరోగ్య శాఖలో అశోక్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం

హనుమకొండ DEMO వేముల అశోక్‌రెడ్డికి ఘనంగా పదవీ విరమణ సన్మానం హనుమకొండ జిల్లా విస్తరణ, మీడియా అధికారి (DEMO) శ్రీ వేముల అశోక్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. అప్పయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డా. అప్పయ్య మాట్లాడుతూ, అశోక్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (IEC) కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పిస్తూ,...