సావనీర్ బుక్‌ను వెనక్కి తీసుకోవాలి* *జీడబ్ల్యూఎంసీ సావనీర్‌పై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం పుస్తకాన్ని చింపివేసి నిరసన
*తెలంగాణ/వరంగల్,ఆగస్టు 31* వరంగల్: వరంగల్ మహానగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)గత పాలకవర్గంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు,వివరాలను సావనీర్ బుక్‌లో ప్రచురించకపోవడంపై బీఆర్‌ఎస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్నను కలిసి వినతిపత్రం అందజేశారు.బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మసూద్,మాజీ కార్పొరేటర్లు మరుపల్లి రవి,ఆవాల రాధికా రెడ్డి,గుగులోత్ రాజునాయక్ తదితరులు మాట్లాడుతూ..సావనీర్‌లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫొటోలు మాత్రమే ప్రచురించడం సరైన విధానం కాదన్నారు.గత పాలకవర్గం,బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటోలు,వివరాలను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు.కార్పొరేషన్ పంపిణీ చేసిన సావనీర్ బుక్‌ను చింపివేసి నిరసన తెలిపారు.ప్రస్తుత సావనీర్‌ను వెంటనే వెనక్కి తీసుకుని,అన్ని...