ప్రైవేట్ ఉపాధ్యాయులకూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలి ప్రైవేట్ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సింగనబోయిన శ్రీశైలం,

ఉపాధ్యాయుడు ప్రభుత్వ స్కూల్స్ లో బోధించిన ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ లో బోధించినా, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఒక్కటే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త అయిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించడం మన సంప్రదాయం అయితే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదు, విద్యారంగంలో ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు కూడా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు,...