చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత- చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హిందూ స్మశానవాటికలో మొక్కలు నాటిన నాయకులు

వరంగల్, లేబర్ కాలనీ: లేబర్ కాలనీలోని హిందూ స్మశానవాటికలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ విభాగం సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. 18, 19, 27, 16వ లేబర్ కాలనీ అబ్బని కుంట గాంధీ నగర్ డివిజన్లకు చెందిన పెద్దలు, నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ విభాగం ప్రశాంత్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలిగినా, ఆక్సిజన్ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేడని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు...