వరంగల్ పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

హన్మకొండ పట్టణంలోని హంటర్ రోడ్డులో అదాల జంక్షన్ నుండి నీలిమ జంక్షన్ వరకు గల ప్రాంతంలో అనేక పాఠశాలలు మరియు కళాశాలలు ఉన్నాయి. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో వారి సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ఈ ప్రాంతంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ గారు, పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకన్న గారు, అలాగే ఆర్ అండ్ బి శాఖ అధికారులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు.పరిశీలన అనంతరం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం మరియు రోడ్డు...