పాలన చేతకాక.. భౌతిక దాడులే కాంగ్రెస్ దిక్క?
సెప్టెంబర్ 1 (జన చరిత్ర): బీజేపీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్ అసహనానికి పరాకాష్ట: *తుమ్మల మురళీధర్ రెడ్డి* మోత్కూరు: మోత్కూరు మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముష్పట్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి నలుపు రంగు పూయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముష్పట్ల గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. సొంత పార్టీలో సొంత నాయకుల మధ్య పంచాయతీలు, అంతర్గత కుమ్ములాటలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ కార్యాలయంపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ ఇంటి పంచాయతీలను తామే పరిష్కరించుకోవాల్సింది పోయి, వాటి...