నల్లగొండ జెన్‌జీ యువతతో తీన్మార్ మల్లన్న ముఖాముఖి

నల్లగొండ: నేటి యువత ఆలోచనలు, సమస్యలు, భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకోవడంతో పాటు వారిని రాజకీయ, సామాజిక అంశాలపై చైతన్యపరిచే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జెన్‌జీ యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఆర్ గార్డెన్‌లో టీఆర్‌పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, జెన్‌జీ యువత మల్లన్నతో నేరుగా ముఖాముఖి నిర్వహించి పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. విద్య, ఉపాధి అవకాశాలు, యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, భవిష్యత్ రాజకీయాలు తదితర...