సంస్థాన్ నారాయణపురం లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలో నేడు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైయస్సార్ తెలుగు వారికి దూరమై 17 సంవత్సరాలు గడిచినా నేటికీ వారు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కనుల ముందు కదలాడుతున్నాయని అన్నారు , ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతో వైయస్సార్ కు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ,జలయజ్ఞం లాంటి జనాకర్షక పథకాలతో సుపరిపాలన అందించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, వైయస్సార్ స్ఫూర్తితో,...