యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన *కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిన్నింటి అనిల్ రావు* ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చాయని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు...