మోత్కూర్: వైఎస్సార్ వర్ధంతి

సెప్టెంబర్ 2 (జన చరిత్ర): మోత్కూరులో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధింతిని నిర్వహించారు. వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదల పెన్నిధిగా, అభివృద్ధి ప్రదాతగా వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని నాయకులు అన్నారు. రైతులు విద్యార్థులు మహిళల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాలరాజు పట్టణ అధ్యక్షులు గుండుగోని రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.