కాశిబుగ్గ ముదిరాజ్‌వాడలో ఘనంగా పోచమ్మ బోనాలు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య BRS మాజీ ఎమ్మెల్యే నన్నపనేని Narender బీఆర్‌ఎస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులు ప్రదీప్ రావు వరంగల్: కాశిబుగ్గ ముదిరాజ్‌వాడలో పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ముదిరాజ్‌వాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి లుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల పండుగలో పాల్గొన్న భక్తులు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా...