పోచమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొని బోనం ఎత్తిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బోనం ఎత్తిన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో...