ఈనెల 5 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి
నల్గొండ జిల్లా, నకిరేకల్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనకు హాజరుకానున్న దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల ఐదున నల్గొండ జిల్లా, నకిరేకల్ కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని, ఏరియా ఆసుపత్రి ప్రారంభం తర్వాత బహిరంగ సభకు వస్తారని, అక్కడే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా...