28వ డివిజన్ లో పేదలకు కళ్లద్దాల పంపిణి

నల్లగొండ: సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలని నల్గొండ మున్సిపల్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు.నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ లో ఒంటి స్తంభం వద్ద శివాలయంలో మేయర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 28వ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మ తెలిపారు డివిజన్లోని పేదలకు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో కళ్లద్దాలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా...