రేవంత్ రెడ్డి మాటలు..తుపాకీ రాముని మాటలు ఒక్కటే వాగ్దానాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణ/వరంగల్/పాలకుర్తి,సెప్టెంబర్ 2 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.హామీలను గుర్తుచేసేందుకే 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన,గ్రామాల్లో బాకీ కార్డుల పంపిణీ చేపట్టామని తెలిపారు.మహిళలకు నెలకు రూ.2,500,వృద్ధులు,బీడీ కార్మికులకు రూ.4 వేలు,దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్,రైతు భరోసా,రుణమాఫీ,పంటలకు బోనస్,రైతు కూలీలకు ఆర్థిక సాయం,నిరుద్యోగ భృతి,ఉద్యోగాల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని...