దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకుల అరెస్ట్ రెండు ద్విచక్ర వాహనాలు,రూ.1,000 నగదు స్వాధీనం
తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 2 గీసుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో చోరీకి పాల్పడటంతో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగిలించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు,రూ.1,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.కాశిబుగ్గకు చెందిన సముద్రాల సురేష్ మచ్చాపూర్ గ్రామ శివారులో లక్ష్మీ గణపతి సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్నారు.ఆగస్టు 29న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పరిశ్రమలోని ఓ గది తాళం పగులగొట్టి సెల్ఫ్‌లో ఉంచిన రూ.10 వేల నగదును అపహరించారు.బాధితుడి ఫిర్యాదుతో గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో బుధవారం ఊకల్ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని...