దివ్యాంగులకు సేవలు చేస్తున్న సేవకులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి- వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ.

దివ్యాంగులకు సేవలు చేస్తున్న సేవకులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి- వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ. వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి పూజ వరంగల్‌ కాశీబుగ్గలోని మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న మానసిక దివ్యాంగులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారికి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, సమాజంలో ఆదరణ అవసరమైన మానసిక దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా దివ్యాంగులకు అందిస్తున్న సేవలను అభినందించారు. మిషనరీస్...