యుగయుగాల శ్రీకృష్ణ తత్త్వం: డిజిటల్ యుగానికి దివ్య మార్గదర్శకం!

మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలి వేగంగా మారిపోతోంది. కానీ, శతాబ్దాలు గడిచినా నిత్యనూతనంగా నిలిచే ఒకే ఒక్క మార్గదర్శనం శ్రీకృష్ణ తత్త్వం. సాధారణంగా శ్రీకృష్ణుడు అనగానే పిల్లనగ్రోవి, నెమలి పింఛం, రాధాకృష్ణుల ప్రేమ లేదా కురుక్షేత్ర భగవద్గీత మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. నిజానికి శ్రీకృష్ణావతారం ఒక వ్యక్తి పూజ కాదు.. అదొక సమగ్ర జీవన విజ్ఞానం, సకల శాస్త్రాల సమాహారం. సంపూర్ణ శాస్త్రాల సమ్మేళనం శ్రీకృష్ణుడు కేవలం పురాణ పురుషుడు మాత్రమే కాదు, గొప్ప ఆచరణవాది. దర్శనం, రాజనీతి, తత్త్వశాస్త్రం, యోగం, భక్తి, జ్ఞానం, మనోవిజ్ఞానం, సమాజహితం వంటి అనేక రంగాల కలయికే ఆయన అవతారం. బాల్యంలో లీలాతత్త్వం, యౌవనంలో భక్తి తత్త్వం,...