కోతులారం MPPS HM ను వెంటనే బర్తరఫ్ చేయాలి: 07న DSE ఆఫీస్ ముట్టడికి 'JAC' మరియు 'చరణ్య శ్రీ ఫౌండేషన్' పిలుపు

ఫోర్జరీ సంతకాలు, నిధుల గోల్‌మాల్ మరియు చిన్నారి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన (కీచక) కోతులారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) హెచ్‌ఎమ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేట్ విద్య నియంత్రణ JAC మరియు చరణ్య శ్రీ ఫౌండేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం, కోతులారం MPPS హెచ్‌ఎమ్ చేసిన తీవ్ర అవినీతి, అక్రమాలు మరియు అసభ్య ప్రవర్తనపై పక్కా ఆధారాలు సమర్పించినప్పటికీ, ఉన్నతాధికారులు కేవలం 2 ఇంక్రిమెంట్లు మాత్రమే కట్ చేసి నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం దారుణమని సంఘ ప్రతినిధులు మండిపడ్డారు. విద్యార్థినులకు రక్షణగా నిలవాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తిపై...