వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రం ప్రారంభం
మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రాన్ని ఈగల్ ఫోర్స్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మద్యం, పొగాకు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వ్యసనం నేడు యువతతో పాటు వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన సామాజిక సమస్యగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాలపై డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అదే సమయంలో మత్తు పదార్థాలకు బానిసలైన యువతను శిక్షించడం మాత్రమే...