అనుమతి లేకుండా ఫ్లెక్సీల ముద్రణ, ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ముద్రించడం, ఏర్పాటు చేయడాన్ని సహించేది లేదని మున్సిపల్ కమిషనర్ **శ్రీ బి. వంశీకృష్ణ** స్పష్టం చేశారు. కమిషనర్ ఛాంబర్‌లో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, **మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పత్రాన్ని పరిశీలించిన అనంతరం మాత్రమే ఫ్లెక్సీలను ముద్రించాలని** సూచించారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, వ్యక్తులు లేదా ఇతర సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చినప్పటికీ ఇదే నిబంధనను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పొందిన **హోర్డింగ్స్, మీడియన్‌లో అనుమతితో ఏర్పాటు చేసిన లాలీపాప్ బోర్డులకు** మాత్రమే సంబంధిత ఫ్లెక్సీలను ముద్రించాలని, అనుమతి లేని ఫ్లెక్సీలను జంక్షన్లు, మీడియన్ పోల్స్ తదితర...