రైతన్నల కోసం పాదయాత్ర చేస్తా: కేటీఆర్
సెప్టెంబర్ 14లోపు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల షెడ్యూల్ ఇవ్వాలి లేకుంటే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర 2003లో కేసీఆర్ పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం రైతన్నల పంటలను కాపాడేందుకు మరోసారి పోరాటానికి సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 14లోపు ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు, ఎంత మేరకు విడుదల చేస్తారో స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా స్పందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి...