ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

రూ.6,05,000/- నగదు, పల్సర్ బైక్, గ్లౌజులు మరియు ఇనుప రాడ్ స్వాధీనం. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ:30-08-2026 నాడు జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ మచిలీబజార్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ నబీ @ ఆర్షద్ (31), ఎండి. సర్వర్ (40) మరియు 16 సంవత్సరాల బాలుడు కలిసి చోరీకి పథకం రచించి, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిది మచిలీబజార్‌కు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో నగదు చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. విచారణలో భాగంగా నిందితులు తెలిపిన వివరాల ప్రకారం, 30.08.2026 నాడు ముగ్గురూ కలిసి బాధితుడి ఇంటి పరిసరాలను ముందుగా పరిశీలించి,...